విడుదల డేట్ ఫిక్స్ చేసుకున్న ‘కపటధారి’

Published on Nov 24, 2020 11:02 pm IST

అక్కినేని హీరో సుమంత్ నటించిన కొత్త చిత్రం ‘కపటధారి’. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని పనులను ముగించుకుని విడుదలకు సిద్దంగా ఉంది. థియేటర్లు వచ్చే నెల నుండి తెరుచుకుంటాయనే క్లారిటీ రావడంతో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారు. క్రిస్మస్ పండుగకు ముహుర్తం నిర్ణయించారు. తాజాగా సెన్సార్ పనులు కూడ పూర్తయ్యాయి. బోర్డ్ సభ్యులు యు/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు.

ఇటీవలే విడుదలైన చిత్ర టీజర్ మంచి స్పందన తెచ్చుకుంది. ఇందులో సుమంత్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. చిత్రం ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఉండనుంది. ఇందులో నందిత శ్వేత కథానాయికగా నటించగా నాజర్ ఒక కీలక పాత్రలో నటించారు.
సిమన్‌ కె కింగ్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని డాక్టర్‌ జి.ధనంజయన్‌, లలిత ధనంజయన్‌ నిర్మిస్తున్నారు. క‌న్నడలో సూప‌ర్‌ హిట్ అయిన ‘కవలుదారి’ సినిమాకు ఇది తెలుగు రీమేక్‌.

సంబంధిత సమాచారం :

More