యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ హీరోగా వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించిన రీసెంట్ ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం “ఊరుపేరు భైరవకోన” తో తాను మంచి హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత మరో సినిమాని లాక్ తెలుగులో లాక్ చేసిన సంగతి తెలిసిందే. మాస్ మహారాజ రవితేజతో భారీ హిట్ “ధమాకా” చేసిన దర్శకుడు త్రినాథరావు నక్కినతో సందీప్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
మరి ఈ చిత్రం సందీప్ కిషన్ కెరీర్ లో 30వ సినిమా కాగా ఈ హనుమాన్ జయంతి కానుకగా ముహూర్త కార్యక్రమాలతో ఆరంభం కావడం విశేషం. మరి ఈ సినిమా ముహూర్త కార్యకమానికి నిర్మాత దిల్ రాజు అలాగే అనీల్ సుంకర అలాగే వెర్సటైల్ నటుడు రావు రమేష్ లాంటి దిగ్గజాలు హాజరు కావడం విశేషం. ఇక దిల్ రాజు ఈ సినిమాకి క్లాప్ కొట్టి ఆరంభించారు. ఇక ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా హాస్య మూవీస్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.