అక్రమంగా ప్రదర్శించబడుతున్న సందీప్ కిషన్ సినిమా !

29th, December 2017 - 03:20:30 PM

యంగ్ హీరో సందీప్ కిషన్ చేసిన ద్విభాషా చిత్రం తెలుగులో ‘ప్రాజెక్ట్ జెడ్’ పేరుతో ఈరోజే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ సినిమా కొన్ని అనివార్య కారణాల వలన అనుమతులు అందనందున విడుదలకాలేదు. చాలా చోట్ల ఉదయం షోలన్నీ రద్దయ్యాయి. కానీ కొన్ని చోట్ల మాత్రం సినిమా అక్రమంగా ప్రదర్శితమైంది.

దీనిపై స్పందించిన సందీప్ కిషన్ సినిమాలో తన డబ్బింగ్ లేకుండానే, నిర్మాతల నుండి క్లియరెన్స్ లేకుండానే కొన్ని చోట్ల సినిమా ప్రదర్శితమైంది. ఇది చట్టరీత్యా నేరం. దీనిపై పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాం అంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. సివి కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం కొద్దిరోజుఅల్ క్రితమే తమిళంలో ‘మాయావన్’ పేరుతో విడుదలై మంచి ఫలితాన్ని అందుకుంది.