మన టాలీవుడ్ లో ఉన్న పలువురు మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో సందీప్ కిషన్ కూడా ఒకడు. హీరోగా మంచి విజయలను అందుకునే సమయంలోనే మళ్ళీ ఫ్లాపులతో వెనక్కి పడ్డ ఈ నటుడు లేటెస్ట్ గా రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మళ్ళీ ట్రాక్ లో పడ్డాడు. మంచి కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న ఈ హీరో నుంచి లేటెస్ట్ గా మరో సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది.
టాలీవుడ్ ప్రముఖ రచయిత మరియు నిర్మాత కోన వెంకట్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి మన దక్షిణాదిలో సెన్సేషన్ ను నమోదు చేసిన హిట్ ట్రాక్ “రౌడీ బేబీ” టైటిల్ ను ఖరారు చేసి ఆ పోస్టర్ ను కూడా అనౌన్స్ చేసారు. ఇక అలాగే ఈ చిత్రానికి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా చౌరస్తా రామ్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రం షూట్ కూడా నేటి నుంచే మొదలు కానుంది.


