‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ కోసం యంగ్ హీరో డబ్బింగ్ !

Published on Jan 28, 2020 9:34 am IST

ఇక గత కొంత కాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న సందీప్ కిషన్ ఎట్టకేలకూ ‘నిన్ను వీడని నీడను నేనే’తో మంచి హిట్ అందుకున్నా.. మళ్ళీ తెనాలి రామకృష్ణ రూపంలో మరో ప్లాప్ తన ఖాతాలో చేరింది. అందుకే తన తదుపరి సినిమాలను చాల జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. కాగా సందీప్ కిష‌న్ ప్రస్తుతం హీరోగా చేస్తోన్న సినిమా ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం సందీప్ కిషన్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టారు. ఈ చిత్రం హ‌కీ బ్యాక్‌ డ్రాప్‌ లో తెర‌కెక్కనుంది.

డెన్నిస్ జీవ‌న్ క‌నుకొలను ద‌ర్శ‌క‌త్వంలో రానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌ పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కెవిన్ రాజు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. అన్నట్టు ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :

X
More