సినిమాకు బూస్ట్ ఇచ్చే పనిలో యువ హీరో

Published on Jul 14, 2019 1:59 pm IST

సినిమా విడుదలకాకముందే కాదు విడుదలైన తర్వాత కూడా ప్రమోషన్లు సినిమాకు చాలా అవసరం. అందుకే హీరోలు తమ సినిమాలు థియేటర్లో ఉండగానే ఎంత వీలైతే అంతలా ప్రమోషన్స్ చేస్తుంటారు. వీటి వలన సినిమా వసూళ్లు పుంజుకునే వీలుంది. అందుకే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ప్రమోషన్లలో విరివిగా పాల్గొంటుంటారు.

యువ హీరో సందీప్ కిషన్ చేసిన ‘నిను వీడని నీడను నేనే’ చిత్రం గత శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇంకొంత పుష్ ఇస్తే అవి మరింతగా పెరిగే ఛాన్సుంది. అందుకే సందీప్ కిషన్ ఈరోజు సాయంత్రం సుదర్శన్ 35 ఎంఎం థియేటర్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. పైగా నిర్మాత కూడా తానే కావడంతో రెట్టింపు ఎఫర్ట్ పెడుతున్నారాయన.

సంబంధిత సమాచారం :

X
More