లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో తమిళ హీరో విజయ్ తనయుడు జేసన్ సంజయ్ డైరెక్షన్‌లో సుందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ‘సిగ్మా’ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు సంబంధించిన టీజర్‌ను డిసెంబర్ 23 సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. టీజర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరగనున్నాయి.
సంప్రదాయాలను లెక్కచేయకుండా తన కలల వెంటే ధైర్యంగా ముందుకు సాగే వ్యక్తి కథే సిగ్మా. ట్రెజర్ హంట్ ఉత్కంఠ, యాక్షన్, అడ్వెంచర్, హాస్యాన్ని సమపాళ్లలో అందించే పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంది.
ఫరియా అబ్దుల్లా, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా, సంగీతాన్ని థమన్ అందించారు. ఈ సినిమాను వేసవిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.


