బాలయ్య సినిమాకి విలన్ రెడీ !

Published on Jan 17, 2021 6:36 pm IST

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో రానున్న సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి నటించబోతున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా సునీల్ శెట్టిని ఈ సినిమాలో ఫిక్స్ చేశారట. ఇక ఈ భారీ యాక్షన్ సినిమాలో విలన్ పాత్ర వెరీ పవర్ ఫుల్ గా ఉంటుందట. ఇక సీనియర్ బాలయ్య క్యారెక్టర్ కేవలం రెండు సీన్స్ లో మాత్రమే ఉంటాడని.. ఆ క్యారెక్టర్ కి విలన్ గా ప్లాష్ బ్యాక్ లో సునీల్ శెట్టి కనిపిస్తున్నాడని తెలుస్తోంది. మరి సునీల్ శెట్టి, బాలయ్య సినిమాలో ఏ లుక్స్ లో కనిపించబోతున్నాడో.. ఎలాంటి పాత్ర చేయబోతున్నాడో చూడాలి.

ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, పూర్ణ నటిస్తున్నారు. మరొక ప్రముఖ నటుడు శ్రీకాంత్ ఇందులో నెగెటివ్ రోల్ చేస్తుండగా ప్రధాన ప్రతినాయకుడు ఎవరనేది ఇంకా బయటపెట్టలేదు టీమ్. కాగా బాలయ్యకు ‘సింహ’, ‘లెజెండ్’ లాంటి సూపర్ విజయాలను అందించారు బోయపాటి. కాబట్టి ఈసారి కూడా సూపర్ హిట్ ఇస్తాడని బాలయ్య ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More