“ఎఫ్3” లో సునీల్ క్యారెక్టర్ మరో లెవెల్ లో!?

Published on Jul 13, 2021 11:24 pm IST

అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఎఫ్ 3. ఈ చిత్రం లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరియు విక్టరీ వెంకటేష్ లు హీరో లు గా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ తాజాగా మొదలైన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం ఈ ఆగస్ట్ కి విడుదల కావాల్సి ఉండగా, కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. అయితే ఈ చిత్రం సెట్స్ లో తాజాగా ప్రముఖ కమెడియన్, నటుడు సునీల్ కనిపించిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రం లో సునీల్ మరొక కీలక పాత్ర లో నటిస్తున్నారు. అయితే ఎఫ్ 2 కి కొనసాగింపు గా వస్తున్న ఈ చిత్రం లో సునీల్ పాత్ర హైలెట్ గా ఉంటుంది అని తెలుస్తోంది. వరుణ్ తేజ్ మరియు వెంకటేష్ లను ఇబ్బందులకు గురి చేసే పాత్రగా సునీల్ కనిపిస్తారు అని తెలుస్తోంది. అయితే సునీల్ రాక తో ఈ చిత్రం లో అంతకుమించి నవ్వులు ఉంటాయి అని తెలుస్తోంది. ఈ చిత్రం లో తమన్నా భాటియా, మెహ్రిన్ కౌర్ లు కథానాయికలు గా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం విడుదల తేదీ పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :