కమిడియన్ నుండి హీరోగా మారిన సునీల్ మళ్లీ కమిడియన్ గా ప్రస్తుతం 3చిత్రాలలో నటిస్తున్నాడు. అందులో ఒకటి అరవింద సమేత ఈచిత్రంలో తన పాత్ర ఎలావుండనుందో తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో వివరించాడు. చాలా మంది నన్ను ఇదే ప్రశ్న అడుగుతున్నారు. ఈసినిమాలో నా పాత్ర ‘అతడు’సినిమాలో మాదిరిగానే ఉంటుందని ఆయన అన్నారు. సిల్లీ ఫెలోస్ ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూ లో సునీల్ ఈ విషయాలు వెల్లడించారు.
అల్లరి నరేష్ తో కలిసి ఆయన నటించిన ‘సిల్లీ ఫెలోస్’ చిత్రం ఈ నెల 7న విడుదలకానుంది. ఈచిత్రంలో ఆయన అల్లరి నరేష్ ఫ్రెండ్ పాత్రలో నటించారు. . ఇక సునీల్ ఈరెండు చిత్రాలతో పాటు రవితేజ,శ్రీను వైట్ల కలయికలో తెరకెక్కుతున్న ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రంలో కూడా నటిస్తున్నాడు.


