విజయ్ ‘ఫైటర్’లో మాజీ బాలీవుడ్ హీరో ?

విజయ్ ‘ఫైటర్’లో మాజీ బాలీవుడ్ హీరో ?

Published on Jul 12, 2020 11:03 PM IST

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ కలయికలో వస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘ఫైటర్’. అయితే ఈ సినిమా ఓ డాన్ అతని కొడుకుకి మధ్య నడుస్తోందట. కాగా తాజాగా ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం డాన్ గా బాలీవుడ్ మాజీ హీరో సునీల్ షెట్టి, డాన్ కొడుకుగా విజయ్ దేవరకొండ నటిస్తున్నారట. అయితే సునీల్ షెట్టి కేవలం పదిహేను నిముషాల ప్లాష్ బ్యాక్ స్టోరీలో మాత్రమే కనిపిస్తాడట.

కాగా ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఫైటర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మణంలో భాగస్వామి అయ్యాడు. ఇక విజయ్ దేవరకొండ చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి.

ఇక లాక్ డౌన్ తో వచ్చిన గ్యాప్ లో విజయ్ దేవరకొండ తన పాత్ర కోసం కొన్ని వర్కౌట్స్ చేశాడని.. ముఖ్యంగా విజయ్ దేవరకొండ తన లుక్ తో పాటు హెయిర్ స్టైల్ ను కూడా పూర్తిగా మార్చాడని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు