పుష్ప నుంచి మరో అప్డేట్.. ‘మంగలం శ్రీను’ లుక్ రేపు రివీల్..!

Published on Nov 6, 2021 10:25 pm IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ “పుష్ప”. పాన్‌ ఇండియన్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుద‌ల చేయ‌నున్నారు. మొదటి భాగం “పుష్ప ది రైజ్” పేరుతో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే తగ్గేదే లే అన్నట్టుగా వరుస అప్డేట్లతో ఈ చిత్ర ప్రమోషన్స్ కూడా జోరుగానే జరుగుతున్నాయి.

అయితే తన కెరీర్‌లో ఎన్నో గుర్తుండిపోయే పాత్ర‌లు చేసిన సునీల్ కూడా పుష్ప సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. రేపు ఉదయం 10:08 గంటలకు మంగలం శ్రీను (సునీల్ పాత్ర పేరు) లుక్‌ని రివీల్ చేస్తున్నట్టు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ఫహద్ ఫాజిల్ మెయిన్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సుకుమార్ సునీల్‌ని ఎలా చూపిస్తాడోనని అందరూ ఈ లుక్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More