సన్నీ డియోల్ మరో క్రేజీ సీక్వెల్.. ‘బోర్డర్ 2’ రిలీజ్ డేట్ ఖరారు!

సన్నీ డియోల్ మరో క్రేజీ సీక్వెల్.. ‘బోర్డర్ 2’ రిలీజ్ డేట్ ఖరారు!

Published on Aug 15, 2025 10:04 AM IST

sunny deol

బాలీవుడ్ బాలయ్య సన్నీ డియోల్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “జాట్” తో మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకి సీక్వెల్ కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. మరి ఈ సినిమా కాకుండా తన నుంచి రానున్న మరో అవైటెడ్ సీక్వెల్ చిత్రమే “బోర్డర్ 2”. తన కెరీర్లో భారీ హిట్ అయ్యిన గదర్ 2 తర్వాత మళ్ళీ చాలా కాలానికి చేసిన సీక్వెల్ సినిమా ఇది.

దీనిపై కూడా మంచి అంచనాలు ఉండగా నేడు స్వాతంత్ర దినోత్సవం కానుకగా మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి అంచనాలు రేకెత్తించింది. ఇక దీనితో పాటుగా సినిమా వచ్చే ఏడాది జనవరి 22 న గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. మరి ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించగా భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ లు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు