బాలీవుడ్ స్టార్ నటుడు సన్నీ డియోల్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో చేసిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే ‘జాట్’. మరి మాస్ ఆడియెన్స్ లో అలాగే సన్నీ ఫ్యాన్స్ లో క్రేజీ రెస్పాన్స్ ని అందుకున్న ఈ చిత్రం నార్త్ బెల్ట్ లో స్టడీ వసూళ్ళతో దూసుకెళ్తుంది. లేటెస్ట్ గా ఈ చిత్రం నిన్న శుక్రవారం కూడా సుమారు 4 కోట్ల మేర నెట్ వసూళ్లు అందుకొని అదరగొట్టింది.
దీనితో మొత్తం 66 కోట్లకి పైగా నెట్ వసూళ్లు ఈ సినిమా ఇండియా వైడ్ అందుకున్నట్లు బాలీవుడ్ పి ఆర్ లెక్కలు చెబుతున్నాయి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా మన టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే. అలాగే దీనికి సీక్వెల్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు.