ప్రభాస్ తమ్ముడిగా నటించబోయేది ఇతనేనట

Published on Feb 23, 2021 10:47 pm IST


ప్రభాస్ సైన్ చేసిన భారీ బడ్జెట్ పిరియాడికల్ మూవీ ‘ఆదిపురుష్’ ఇటీవలే ముంబైలో అట్టహాసంగా మొదలైంది. అగ్నిప్రమాదం రూపంలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ చిత్ర బృందం షూటింగ్ ఆపలేదు. ప్రజెంట్ ముంబైలోనే చిత్రీకరణ కొనసాగుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. రాముడు పాత్ర ఉంటే పక్కన ఆయన సోదరులు లక్ష్మణుడు, భరత శత్రుజ్ఞులు కూడ ఉండాల్సిందే. ఆ పాత్రలు కూడ రాముడి కథలో ఎంతో ముఖ్యం.

అందుకే సినిమాలో ఆ పాత్రల కోసం ప్రతిభావంతులైన నటుల్ని ఎంచుకుంటున్నారు దర్శకుడు ఓం రౌత్. తాజాగా లక్ష్మణుడి పాత్ర కోసం సన్నీ సింగ్ అనే బాలీవడు నటుడ్ని ఎంపిక చేసుకున్నారు ఆయన. సన్నీ సింగ్ చిత్రీకరణలో కూడ పాల్గొంటున్నారు. ఇక భరత శత్రుజ్ఞుల పాత్రల్లో ఎవరు నటిస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. భూషణ్ కుమార్, కృషన్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో తెరకెక్కనుంది. ఇందులో సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. 2022 ఆగష్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

సంబంధిత సమాచారం :

More