అన్ స్టాపబుల్: యానిమల్ టీమ్ ఎపిసోడ్ కి సెన్సేషన్ రెస్పాన్స్!

అన్ స్టాపబుల్: యానిమల్ టీమ్ ఎపిసోడ్ కి సెన్సేషన్ రెస్పాన్స్!

Published on Nov 27, 2023 10:00 AM IST

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఓటిటి షో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే లిమిటెడ్ ఎడిషన్. ఈ షో కి యానిమల్ మూవీ టీమ్ విచ్చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన ఆహా వీడియో లో ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ అందుబాటులో ఉంది. దీనిని రిలీజ్ చేయగా, ఆడియెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

ఇప్పటి వరకూ ఈ ఎపిసోడ్ 25 మిలియన్స్ కి పైగా స్ట్రీమింగ్ మినిట్స్ తో దూసుకు పోతుంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న లు హాజరు అయ్యారు ఈ ఎపిసోడ్ లో. యానిమల్ మూవీ డిసెంబర్ 1, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు