‘సర్కారు’ బ్లాస్టర్ కి 33 మిలియన్ల వ్యూస్

‘సర్కారు’ బ్లాస్టర్ కి 33 మిలియన్ల వ్యూస్

Published on Aug 16, 2021 5:40 PM IST

SarkaruVaariPaata

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రానున్న ‘సర్కారు వారి పాట’ సినిమా నుండి వచ్చిన స్పెషల్‌ వీడియో సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చింది. రిలీజ్ అయిన దగ్గర నుండి ఈ వీడియో లైక్స్ అండ్ షేర్ లతో ట్రెండ్ సెట్ చేస్తూ సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తోంది.

కాగా తాజాగా 33 మిలియన్ల వ్యూస్ ను, అలాగే 9 లక్షల 50 వేల లైక్స్ ను సొంతం చేసుకుని కొత్త రికార్డ్ ను సెట్ చేసింది ఈ వీడియో. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా సాగుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు