ఓటిటి ప్లాట్ ఫామ్ పై సూపర్ స్టార్ మహేష్ ఏమన్నారంటే?

Published on Aug 10, 2021 1:42 pm IST


కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కారణంగా థియేటర్ల వద్దకు వచ్చేందుకు ప్రేక్షకులు ఇంకా కాస్త ఆందోళన చెందుతున్నారు. పెద్ద పెద్ద సినిమాల విడుదల కి కాస్త సమయం తీసుకుంటున్నారు. ఈ నేపథ్యం లో పలు చిత్రాలు ఓటిటి ద్వారా విడుదల అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మేరకు ప్రముఖ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓటిటి ప్లాట్ ఫామ్ పై తన అభిప్రాయం ను వెల్లడించారు.

తన సినిమాలు బిగ్ స్క్రీన్ లో చూసేందుకు తెరకెక్కిస్తున్నామని అన్నారు. అయితే అలా థియేటర్ల నుండి ప్రేక్షకులని, తన అభిమానులను వేరు చేయను అంటూ సూపర్ స్టార్ చెప్పుకొచ్చారు. కానీ ఓటిటి ప్లాట్ ఫామ్ కి రెస్పెక్ట్ ఇస్తా అంటూ చెప్పుకొచ్చారు. అది ఒక ప్రత్యేక సంస్థ అని అన్నారు. థియేటర్ల లో తన అభిమానులను కలుస్తా అని, మాకు ఒప్పందం ఉంది అంటూ మహేష్ బాబు అన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం లో నటిస్తున్నారు. ఈ చిత్రం లో హీరోయిన్ గా కీర్తీ సురేష్ నటిస్తుంది. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :