మహేష్ ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్‌ అదిరింది !

Published on Aug 9, 2021 7:30 am IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రానున్న ‘సర్కారు వారి పాట’ సినిమా నుండి అభిమానులకు సర్‌ప్రైజ్‌ అందింది. మహేశ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ రోజు ‘సూపర్‌స్టార్‌ బర్త్‌డే బ్లాస్టర్‌’ పేరుతో ఈ వీడియో రిలీజ్ చేశారు. మునుపెన్నడూ లేనివిధంగా ఇందులో మహేశ్‌ మరింత యంగ్‌ గా‌ కనిపించారు. ‘ఇఫ్‌ యూ మిస్‌ ది ఇంట్రస్ట్‌ యు విల్‌ గెట్‌ ది డేట్‌’ అంటూ మహేష్ చెప్పిన డైలాగ్‌ చాల బాగుంది.

ఇక ‘సార్‌ పడుకునే ముందు ప్రతి రోజూ దిష్టి తీయడం మాత్రం మర్చిపోకండి’ అంటూ మహేశ్‌ అందం గురించి కీర్తి సురేష్ చెప్పే డైలాగ్‌ కూడా బాగుంది. ఈ వీడియో లైక్స్ అండ్ షేర్ లతో ప్రస్తుతం ట్రెండ్ సెట్ చేస్తూ సరికొత్త రికార్డ్స్ ను వైపుగా దూసుకువెళ్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా సాగుతోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :