లేటెస్ట్ పిక్స్ : హైదరాబాద్ లో ల్యాండ్ అయిన సూపర్ స్టార్ మహేష్

లేటెస్ట్ పిక్స్ : హైదరాబాద్ లో ల్యాండ్ అయిన సూపర్ స్టార్ మహేష్

Published on Dec 10, 2022 11:16 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో SSMB28 మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా త్రివిక్రమ్ తీస్తున్న ఈ బ్లాక్ బస్టర్ మూవీ యొక్క మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం ఇటీవల దుబాయ్ వెళ్లిన సూపర్ స్టార్ మహేష్, నేడు కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ తిరిగివచ్చారు.

ఇక లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం అతి త్వరలో ఫ్యామిలీతో కలిసి చిన్న వెకేషన్ వెళ్లనున్న సూపర్ స్టార్, తిరిగి వచ్చిన అనంతరం జనవరి మొదటి వారం నుండి విరామం లేకుండా SSMB28 మూవీ షూటింగ్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీలో మహేష్ బాబు క్యారెక్టర్ అదిరిపోనుండగా దీనిని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు