హమ్మయ్య.. సూపర్ స్టార్ సినిమా మీద ఒక క్లారిటీ వచ్చేసింది

Published on Jan 25, 2021 11:00 pm IST

సూపర్ స్టార్ రజినీకాంత్ చేస్తున్న కొత్త చిత్రం ‘అన్నాత్తే’. శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. లాక్ డౌన్ కారణంగా వాయిదాపడిన ఈ చిత్రం ఈమధ్యనే రీస్టార్ట్ అయింది. హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతుండగా రజినీ అస్వస్థతకు గురికావడంతో నిలిచిపోయింది. తర్వాత రజినీ రాజకీయాల్లోకి రావట్లేదని ప్రకటించడం, అభిమానులు తీవ్ర నిరాశకు గురికావాడం లాంటి పరిణామాలతో సినిమా ప్రస్తావనే మరుగునపడిపోయింది. ఇంకొదరైతే సినిమా ఇప్పట్లో ఉండబోదని, డైరెక్టర్ శివ కొత్త సినిమా పనులు చూసుకుంటున్నారని అన్నారు.

అయితే తాజాగా చిత్ర నిర్మాతలు సినిమా రిలీజ్ డేట్ ప్రకటించి కన్ఫ్యూజన్ క్లియర్ చేశారు. నవంబర్ 24న దీపావళి కానుకగా సినిమా రిలీజ్ ఉంటుందని అనౌన్స్ చేశారు. ఇక షూటింగ్ విషయానికి వస్తే ఇంకొన్ని రోజుల్లో అది కూడ మొదలవుతుందని తెలుస్తోంది. అయితే విడుదలకు మరీ అంత సమయం తీసుకోవడం ఏమిటనేదే అభిమానులకు అర్థంకాని విషయంగా మారింది. ఏది ఏమైనా సూపర్ స్టార్ సినిమా మీద ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. కీర్తి సురేశ్‌, మీనా, ఖుష్బూలు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ ప్రముఖ నటుడు జా కీ ష్రాఫ్‌ ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నారు. రజినీకి జోడీగా నయనతార నటిస్తోంది.

సంబంధిత సమాచారం :