‘బెంగాల్ టైగర్’కి సూపర్బ్ ప్రీ రిలీజ్ బిజినెస్

Bengal-Tiger
మాస్ మహారాజ్ రవితేజ కెరీర్ మొదటి నుంచి రెండు హిట్స్ ఇస్తే ఒక ఫ్లాప్ ఇవ్వడం మళ్ళీ తేరుకొని మరో హిట్ ఇవ్వడం అనేలా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. రవితేజ నటించిన ‘కిక్ 2’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద బాగా నిరాశని మిగిల్చింది. ఇప్పుడు ఆ ఫ్లాప్ ని కవర్ చేయడానికి రవితేజ ‘బెంగాల్ టైగర్’ అనే పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ తో రానున్నాడు. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్స్ గా నటించారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్న ఈ సినిమా నవంబర్ చివరి వారంలో రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది.

‘కిక్ 2’ సినిమా తర్వాత బెంగాల్ టైగర్ కి బిజినెస్ అటు ఇటుగా ఉండచ్చని కొందరు విమర్శించారు. కానీ ఆ విమర్శలన్నిటినీ పాటా పంచలు చేస్తూ బెంగాల్ టైగర్ సూపర్బ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకుంటోంది. దానికి కారణం ఫస్ట్ టీజర్ నుంచే ఈ సినిమాపై అంచనాలు పెరగడం మరియు సంపత్ నంది ప్రేక్షకులు రవితేజని ఎలాంటి పాత్రల్లో చూడాలనుకుంటారో అలాంటి పాత్రలో చూపించడం సినిమాకి ప్లస్ అయ్యింది. దాంతో అన్ని ఏరియాలలో మంచి బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి. అలాగే శాటిలైట్ రైట్స్ కోసం కూడా ప్రముఖ ఛానల్స్ మధ్య మంచి బిజినెస్ పోటీ జరుగుతోంది. దాంతో ఈ చిత్ర టీం బిజినెస్ పరంగా చాలా హ్యాపీగా ఉన్నారు. భీమ్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ బొమన్ ఇరానీ విలన్ గా కనిపించనున్నాడు.

Exit mobile version