భరత్ అనే నేను.. రెస్పాన్స్ అదిరింది!

8th, April 2018 - 02:36:38 PM

టాలీవుడ్ లో ప్రస్తుతం అందరి చూపు భరత్ అనే నేను సినిమాపైనే ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీమంతుడు సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతుండడంతో సినిమా బిజినెస్ పై అంచనాలు కూడా చాలా పెరిగాయి. బహిరంగ సభ ద్వారా క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. ఇకపోతే నిన్న వేడుకలో రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా ఇప్పుడు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ట్రైలర్ లో భావోద్వేగం కనిపించడంతో చిత్రం మంచి సామాజిక అంశంతో ఉంటుందని అర్థమైంది. అలాగే మహేష్ సీఎం క్యారెక్టర్ లో కనిపించడం మరో ప్లస్ పాయింట్. ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రైలర్ వైరల్ అయ్యింది. సెలబ్రెటీలు కూడా ట్రైలర్ చాలా బావుందని చెబుతున్నారు. ఈవెంట్ లో మహేష్ తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన చిత్రమిదే అని చెప్పినందువల్ల అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించాడు. ఏప్రిల్ 20న సినిమా రిలీజ్ కానుంది.