‘పూరి’కి సూపర్ స్టార్ బెస్ట్ విషెస్ !

Published on Sep 28, 2020 1:54 pm IST

డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పుట్టినరోజు నేడు. సూపర్ స్టార్ మహేష్ బాబుకి పూరి ‘పోకిరి’ లాంటి ఇండస్ట్రీ హిట్, బిజినెస్ మెన్ లాంటి సూపర్ హిట్ సినిమాని ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా మహేష్ బాబు, పూరికి బర్త్ డే విషెస్ తెలుపుతూ.. ” నా అభిమాన దర్శకులలో ఒకరైన పూరి జగన్నాథ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ విజయంతో అలాగే చాలా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటున్నాను’ అని మహేష్ ట్వీట్ చేశారు.

ఇక మహేష్ – పూరీ కాంబినేషన్ అంటేనే అభిమానులకు ఫుల్ క్రేజ్. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘పోకిరి’ అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది. ఈ సినిమానే ‘ప్రిన్స్’ మహేష్ బాబును ‘సూపర్ స్టార్’ మహేష్ బాబుగా మార్చింది. ఆ తర్వాత వీరిద్దిరి కాంబినేషన్‌లో వచ్చిన ‘బిజినెస్ మ్యాన్’ కూడ మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో సూర్య భాయిగా మహేష్‌లోని విలన్ షేడ్స్ బయటపెట్టాడు పూరీ జగన్నాథ్. అయితే ఆ తర్వాత వీరి కలయికలో మూడో సినిమాగా ‘జనగణమన’ అనే సినిమాను అనౌన్స్ చేసినా అది పట్టాలెక్కలేదు. మరి గతంలో ఆగిపోయిన జనగణమన సినిమా మళ్ళీ వీరి కలయికలో వస్తోందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More