‘స్టార్ ప్రొడ్యూసర్’కి సూపర్ స్టార్ బెస్ట్ విషెస్ !

Published on Oct 19, 2020 1:15 pm IST

స్టార్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర పుట్టినరోజు నేడు. కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ సుంకరకి బర్త్ డే విషెస్ తెలుపుతూ.. “నా సూపర్ నిర్మాత అనిల్ సుంకరకు పుట్టినరోజు శుభాకాంక్షలు నా షూట్ లో నన్ను సరదాగా సౌకర్యవంతంగా ఉంచే వ్యక్తి, సెట్ లో పని ఒత్తిడి మధ్య అలా ఉండటం అంత తేలికైన విషయం కాదు. ఇలాగే నవ్వుతూ ఉండండి సార్. మీకు ఎల్లప్పుడూ ఆరోగ్యం మరియు ఆనందం ఉండాలని కోరుకుంటున్నాను”. అంటూ మహేష్ ట్వీట్ చేశాడు.

ఇక ప్రస్తుతం మహేష్ బాబు – పరుశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా సెట్ నిర్మాణం పూర్తయిందట. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆర్ట్ డైరెక్టర్ తోట తరుణి ఆధ్వర్యంలో ప్రత్యేకమైన సెంట్రల్ బ్యాంక్ కి సంబంధించిన భారీ సెట్ ను నిర్మించారట. కాగా మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. కరోనా లేకపోయి ఉండి ఉంటే.. ఈ పాటికే షూటింగ్ సగం పూర్తయిపోయేది.

సంబంధిత సమాచారం :

More