వైరల్ పిక్ : యాక్షన్ లోకి దిగిన సూపర్ స్టార్ మహేష్ బాబు

Published on Aug 14, 2022 12:00 am IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించనున్న తాజా సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వనున్న విషయం తెలిసిందే. స్టైలిష్ యక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ వారు ఎంతో భారీగా నిర్మించనుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయనున్నారు. అయితే ఇటీవల విదేశాలకు వెళ్లి ఫ్యామిలీతో కలిసి హాలిడే ఎంజాయ్ చేసి వచ్చిన సూపర్ స్టార్ మహేష్, మొన్న ఇండియాకి తిరిగివచ్చారు. విషయం ఏమిటంటే నేడు హైదరాబాద్ లో ఒక ప్రముఖ కంపెనీ వారి యాడ్ షూట్ లో పాల్గొన్న మహేష్ బాబు షూట్ పిక్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్. ఈ షూట్ పిక్ లో మహేష్ ట్రెండీ స్టైల్ వేర్ లో ఫుల్ క్రాఫ్, గడ్డంతో అదరగొట్టారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :