సూపర్ స్టార్ సినిమాకి కూడా లీకులు బాధ తప్పలేదు !
Published on Sep 11, 2018 4:19 pm IST

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కి విశేష స్పందన రావటంతో ఒక్కసారిగా సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దాంతో దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోని మరి, ఎక్కడా తప్పు జరగకుండా సినిమాని తెరకెక్కిస్తున్నాడట. అయినా ఈ సినిమాకు కూడా లీకుల బాధ తప్పలేదు.

విషయంలోకి వెళ్తే.. గతంలో సినిమాలోని రజనీకాంత్ గెటప్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు లీకై బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా లక్నోలో జరుగుతున్న షూటింగ్ లొకేషన్‌ నుంచి రెండు సీన్స్‌ కూడా లీకైనట్టుగా చిత్రబృందం గుర్తించింది. అయితే ఎలా లీక్ అయ్యాయి, ఎవరు లీక్ చేశారో ఇంకా తెలియాల్సి ఉంది. మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా దర్శక నిర్మాతలు సెక్యూరిటీని పెంచి.. తగిన జాగ్రత్తలు అన్ని తీసుకుందని తెలుస్తోంది. దాదాపు ఐదు వందల మంది నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు ఈ చిత్ర షూటింగ్‌ లో పాల్గొంటున్నారు.

కాగా తమిళ స్టార్ నటులు విజయ్ సేతుపతి , బాబీ సింహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి యువ సంగీత దర్శకుడు అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్నీ సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.

  • 4
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook