‘ఇండియన్ – 2’ ఇంట్రో ని లాంచ్ చేయనున్న సూపర్ స్టార్

indian2 1
లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ యాక్షన్ మూవీ ఇండియన్ 2. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ పై కమల్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి.

అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, సిద్దార్థ, ఎస్ జె సూర్య, ప్రియా భవాని శంకర్, కాళిదాస్ జయరాం, గుల్షన్ గ్రోవర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక తమ మూవీ నుండి ఫస్ట్ లుక్ ఇంట్రో టీజర్ ని నవంబర్ 3న సాయంత్రం 5 గం. 30 ని. లకు రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. కాగా ఈ ఇంట్రో టీజర్ ని కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ రిలీజ్ చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్ ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఇక ఇండియన్ 2 మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

Exit mobile version