జరిగింది చెప్తూ ఎమోషనలైన ‘సురేఖా వాణి’ కూతురు !

Published on May 10, 2021 9:50 am IST

తెలుగు చిత్ర సీమలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి ‘సురేఖా వాణి’. సోషల్‌ మీడియాలో ఆమె ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. అయితే ఆమెతో పాటు ఆమె కూతురు సుప్రీతకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక సుప్రీత ఎప్పటికపుడు నెటిజన్లతో టచ్ లో ఉంటూ వారు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెబుతూ ఉంటుంది. అయితే సురేఖ వాణి భర్త సురేశ్‌ తేజ అనారోగ్యంతో 2019లో మృతి చెందిన విషయం తెలిసిందే.

కాగా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ లోకి వచ్చిన సుప్రీత ఈ సందర్భంగా తన తండ్రితో ఉన్న అనుబంధం ఏంటి? అసలు ఆయన ఎలా చనిపోయారో చెప్పుకొచ్చింది. తనకు, తన తండ్రికి చాలా మంచి రిలేషన్‌ ఉండేదని, నాన్నతో కలిసి బాగా అల్లరి చేసేదాన్ని అని సుప్రీత చెప్పుకొచ్చింది. ఇక తండ్రి మరణం పై మాట్లాడుతూ..నాన్నకి ఎక్కువగా నడిచే అలవాటు ఉండేది. ఓసారి ఎక్కువ నొప్పి రావడంతో డాక్టర్‌ను సంప్రదిస్తే..ఇన్‌ఫెక‌్షన్‌ అయ్యిందని, సర్జరీ చేసి కాలి వేళ్ల వరకు తీసేద్దామని చెప్పారు. సర్జరీ జరిగిన కొన్నాళ్లకు మళ్లీ ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువ అయింది. ఈ లోపు ఆయనకు హార్ట్‌ అటాక్‌ వచ్చి చనిపోయారు అంటూ సుప్రీత ఎమోషనల్‌ గా తెలిపింది.

సంబంధిత సమాచారం :