అఖిల్ కథకు రిపేర్లు జరుగుతున్నాయా ?

Published on May 13, 2021 1:44 am IST

అక్కినేని అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఇది పూర్తిస్థాయి యాక్షన్ ఎంటెర్టైనర్. తాను స్టోరీ రాసేటప్పుడు తన మనసులో అఖిల్ మాత్రమే ఉన్నాడని, ఆయనలోని మాస్ యాంగిల్ ఇప్పటివరకు ఏ సినిమాలోనూ బయటపడలేదని, కానీ తన సినిమాతో బయటికొస్తుందని చెబుతూ సినిమా గురించి, అందులో అఖిల్ పాత్ర గురించి సురేందర్ రెడ్డి భారీ హైప్ ఇచ్చారు. దీంతో అక్కినేని అభిమానుల్లో సినిమా పట్ల విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

ఈ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సురేందర్ రెడ్డి కథను పక్కాగా రెడీ చేస్తున్నారు. కథ పూర్తయినా కూడ ఇంకా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయట. సురేందర్ రెడ్డి కొందరు రచయితలతో ఒక బందాన్ని ఏర్పాటు చేసి స్టోరీకి మెరుగులు దిద్దుతున్నట్టు తెలుస్తోంది. సురేందర్ రెడ్డి చేస్తున్న గ్రౌండ్ వర్క్ చూస్తుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను భారీ విజయంగా మలచాలనే ధృడ సంకల్పంతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేసిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ చిత్రం విడుదలకు రెడీగా ఉంది.

సంబంధిత సమాచారం :