సురేష్ ప్రొడక్షన్స్ లో రాబోయే క్రేజీ సినిమాల లిస్ట్ అదిరిందిగా.

Published on Jun 9, 2019 2:20 pm IST

దాదా సాహెబ్ అవార్డు గ్రహీత మూవీ మొఘల్ డాక్టర్ రామానాయుడు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ దశాబ్దాలుగా అజరామరమైన సినిమాలు నిర్మిస్తూ ప్రఖ్యాత నిర్మాణ సంస్థగా పేరుగాంచింది. దాదాపు అన్ని భారతీయ భాషలలో ఈ సంస్థ చిత్రాలు నిర్మించింది. రామనాయడు మరణం తరువాత ఆ లెగసీని కుమారుడు సురేష్ బాబు కొనసాగిస్తున్నారు. ఇటీవలే 55 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంధర్బంగా సురేష్ బాబు వారు భవిష్యత్ లో నిర్మిస్తున్న సినిమాల వివరాలు తెలిపారు.

రానా, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా వేణు ఉడుగుల దర్శకత్వంలో `విరాట పర్వం` అనే మూవీ నిర్మించనున్నామని అన్నారు. ఇది 90లలో తెలంగాణా ప్రాంతంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటన ల ఆధారంగా తెరకెక్కనుందని సమాచారం. అలాగే గుణశేఖర్ దర్శకత్వంలో `హిరణ్య కశ్యప` అనే భారీ మూవీని రానా తోనే చేస్తున్నామని అన్నారు. ఈ మూవీ కొరకు దాదాపు రెండేళ్లుగా ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా దేశంలోనే అతి పెద్ద సినిమా కాబోతోంది అన్నారు. ఇక, వెంకటేష్‌, నాగచైతన్య హీరోలుగా `వెంకీ మామ` అలాగే ఇటీవల బాలీవుడ్‌లో విడుదలైన `దే దే ప్యార్ దే` సినిమాను వెంకీ హీరోగా తెలుగులోకి రీమేక్ చేయబోతున్నామ`ని సురేష్ బాబు తెలిపారు.

సంబంధిత సమాచారం :

More