తెలుగు ‘దృశ్యం-3’.. క్లారిటీ వచ్చినట్లేగా..!

తెలుగు ‘దృశ్యం-3’.. క్లారిటీ వచ్చినట్లేగా..!

Published on Jan 21, 2026 8:02 AM IST

Dhrushyam 3

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన చేయాల్సిన ‘దృశ్యం 3’ తెలుగు వెర్షన్ ఆగిపోయిందంటూ సినీ సర్కిల్స్, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు స్పందించారు. ఈ సినిమా షెల్వ్ కాలేదని, అక్టోబర్ నెల నుండి షూటింగ్ ప్రారంభమవుతుందని స్పష్టం చేస్తూ పుకార్లకు చెక్ పెట్టారు.

ప్రస్తుతం వెంకటేష్, త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత అనిల్ రావిపూడితో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్‌లో నటిస్తారు. ఇటీవల చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంలో ఆయన చేసిన క్యామియో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మరోవైపు జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్‌లాల్ నటించే ఒరిజినల్ వెర్షన్ 2026 వేసవిలో విడుదల కానుంది. అదే ఏడాది ద్వితీయార్థంలో అజయ్ దేవగన్ హీరోగా హిందీ వెర్షన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏదేమైనా తెలుగు దృశ్యం 3 పై ఎట్టకేలకు ఓ క్లారిటీ వచ్చేసిందని చెప్పాలి.

తాజా వార్తలు