ఆరు రీమేక్ సినిమాలు చేయనున్న సురేష్ ప్రొడక్షన్స్

Published on Dec 15, 2019 11:01 pm IST

ప్రముఖ నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు 2020కి చాలా ప్లాన్స్ చేసి పెట్టుకున్నారు. కేవలం స్ట్రైట్ తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా ఇతర భాషల్లో సూపర్ హిట్లుగా పేరు తెచ్చుకున్న ఈ చిత్రాలను తెలుగులోకి అనువదించే పనిలో ఉన్నారు. ఇప్పటికే తమిళ చిత్రం ‘అసురన్’ను తెలుగులోకి రీమేక్ చేసే పనిలో ఉన్న ఆయన ఇంకొన్ని సినిమాల్ని కూడా సెలెక్ట్ చేసి పెట్టుకున్నారట.

వాటిలో హిందీ చిత్రాలు ‘డ్రీమ్ గర్ల్, సోనూ కే టిక్కూ కే స్వీటీ’లు ఉన్నాయి. అలాగే ఇంకో రెండు కొరియన్ చిత్రాలు కూడా ఉన్నాయట. అయితే ఆ చిత్రాలు ఏమిటనేది ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం ఈ ఐదు సినిమాల్లో కనీసం మూడు చిత్రాలైనా వచ్చే యేడాదికి పట్టాలెక్కే ఛాన్సుంది. ఇక వీటితో పాటు రానాతో రూ.180 కోట్ల ‘హిరణ్యకశ్యప’ చిత్రంతో పాటు ఇంకొన్ని డైరెక్ట్ తెలుగు సినిమాలు కూడా ఉండే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :

X
More