లేటెస్ట్ తమిళ్ బ్లాక్ బస్టర్ రైట్స్ కొనుగోలు చేసిన సురేష్ ప్రొడక్షన్స్.!

Published on Jan 6, 2022 5:21 pm IST

ఈ కరోనా కష్ట కాలంలోనే థియేటర్స్ లోకి వచ్చి రిలీజ్ అయ్యిన చిత్రాలు ప్రతి సినీ ఇండస్ట్రీ నుంచి కూడా అనేకం ఉన్నాయి. మరి అలా టాలీవుడ్ ఇండస్ట్రీ సహా కోలీవుడ్ లో కూడా రీసెంట్ గా కొన్ని సినిమాలు నిలవగా వాటిలో తమిళ్ ఆడియెన్స్ లో భారీ రెస్పాన్స్ అందుకున్న తాజా చిత్రం “మానాడు”.

అక్కడి స్టార్ నటులు శింబు మరియు ఎస్ జె సూర్య ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ చిత్రం భారీ హిట్ గా నిలిచి ఈ ఈఏడాది కోలీవుడ్ లో మరో టాప్ సినిమాగా నిలిచింది. మంచి వసూళ్లు సహా మంచి రేటింగ్స్ ను ఈ సినిమా అందుకొని శింబు కెరీర్ లో మంచి కం బ్యాక్ గా కూడా నిలిచింది.

ఇప్పుడు ఈ సినిమా తాలుకా రీమేక్ హక్కులని తెలుగు సహా అన్ని ఇండియన్ భాషలకు గాను మన టాలీవుడ్ లో బెస్ట్ కంటెంట్ ఇచ్చే ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ వారు కొనుగోలు చేసినట్టుగా అధికారికంగా ప్రకటించారు. దీనితో తెలుగులో ఈ రీమేక్ పై ఇప్పుడు మరింత ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :