సురేష్ ప్రొడక్షన్స్ లో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ తో సింహా.!

Published on Jul 8, 2021 1:00 pm IST

మన టాలీవుడ్ లో ఏ ట్రెండ్ కి తగ్గట్టుగా ఆ ట్రెండ్ ఫ్రెష్ సినిమాలని అందించే ప్రముఖ టాలీవుడ్ బ్యానర్లలో ఖచ్చితంగా సురేష్ ప్రొడక్షన్ ముందుంటుంది. గత కొంత కాలం నుంచి కూడా మంచి యూత్ ఫుల్ సినిమాలు సహా స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేస్తూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ను అనౌన్స్ చేశారు. “మత్తు వదలరా” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు సింహా కోడూరి ఆ తర్వాత కూడా ఆసక్తికర సబ్జెక్టులనే ఎంచుకున్నాడు.

ఇప్పుడు ఆ లిస్ట్ లో ఈ ఆసక్తికర ప్రాజెక్ట్ చేరింది. అయితే ఇది అంత ఇంట్రెస్టింగ్ అని ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఒకటి బ్యానర్ మరొకటి ఈ సినిమా కాన్సెప్ట్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తున్నారట. అలాగే ఈ చిత్రానికి “దొంగలున్నారు జాగ్రత్త” అనే టైటిల్ ని పెట్టడంతో ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటి అన్నది కూడా అర్ధం అయ్యింది.

అలాగే మరో ఆసక్తికర అంశం ఏమిటంటే ఈ సినిమా వెర్సిటైల్ నటుడు సముథిరఖని కూడా నటిస్తున్నారట. మరి ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు సతీష్ త్రిపుర తెరకెక్కిస్తుండగా సురేష్ ప్రొడక్షన్స్ తో పాటు గురు ఫిలిమ్స్ వారు కూడా ఈ సినిమాని కలిపి నిర్మాణం వహిస్తున్నట్టుగా సురేష్ ప్రొడక్షన్స్ వారు అనౌన్స్ చేశారు. అలాగే ఈ సినిమా షూట్ కూడా తొందరలోనే స్టార్ట్ చేసేయనున్నట్టు తెలిపారు.

సంబంధిత సమాచారం :