తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న 37వ చిత్రం యొక్క టైటిల్ కోసం నిన్న ఈ చిత్ర డైరెక్టర్ 3 టైటిల్స్ ను ప్రకటించి అందులో ఒకదాన్ని ఎంచుకోండని పోల్ పెట్టాడు. మీట్పాన్ , కాపాన్ ,ఉఇర్కా అనే టైటిల్స్ లలో ఉఇర్కా కు ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఇక ఈ చిత్రం యొక్క టైటిల్ ను న్యూ ఇయర్ రోజున జనవరి 1న అధికారికంగా ప్రకటించనున్నారు.
కేవీ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో మోహన్ లాల్ , బోమన్ ఇరానీ , ఆర్య , చిరాగ్ జానీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈచిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య ఎన్ ఎస్ జి కమాండర్ గా నటిస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రం రెండు షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుంది.
ఇక ప్రస్తుతం సూర్య ‘ఎన్జీకె’ చివరి షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. సెల్వ రాఘవన్ తెరకెక్కిస్తున్న ఈచిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదలచేయనున్నారు.


