పోలీస్ కంప్లయింట్ ఫైల్ చేసిన సూర్య

పోలీస్ కంప్లయింట్ ఫైల్ చేసిన సూర్య

Published on Jan 22, 2015 11:16 PM IST

Suriya-praises-Kamal-Haasan
తన పేరు మీద ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఒక ఫేక్ ఫేస్ బుక్ పేజిని సృష్టించారని తమిళ నటుడు సూర్య సైబర్ క్రైమ్ సెల్ లో కంప్లైంట్ జారీ చేశాడు. నిన్న క్రియేట్ చెయ్యబడ్డ ఈ పేజికి వేల సంఖ్యలో లైక్ లు వచ్చిపడడంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. దీన్ని సృష్టించిన వ్యక్తి ఫేస్ బుక్ యాజమాన్యాన్నే డుమ్మా కొట్టించి వెరిఫైడ్ స్టేటస్ సంపాదించుకున్నాడు. విషయం తెలిసినవెంటనే పేజ్ ని తీసేయమని సూర్య పోలీసులను ఆశ్రయించాడు.

సోషల్ నెట్వర్కింగ్ సైట్ లలో సెలబ్రిటీల పేజ్ లు తమకు తెలియకుండా సృష్టించబడడం సర్వసాధారణ విషయమే. ఇటీవలే తన పేరుతో ఎవరో ఒక మెయిల్ ఐ.డి క్రియేట్ చేసి అసభ్యకరమైన మెయిల్స్ పంపుతున్నట్టు హృతిక్ రోషన్ కూడా కంప్లయింట్ జారీ చేశాడు.

సూర్యకి ఎటువంటి ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్ లు లేవని ప్రెస్ నోట్ విడుదలచేశారు. ప్రస్తుతం సూర్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘మాస్’ సినిమా షూటింగ్ పనులలో బిజీగా వున్నాడు.

తాజా వార్తలు