రెట్రో ట్రైలర్ టాక్.. మాస్ యాక్షన్‌తో ఆకట్టుకున్న సూర్య

రెట్రో ట్రైలర్ టాక్.. మాస్ యాక్షన్‌తో ఆకట్టుకున్న సూర్య

Published on Apr 18, 2025 7:47 PM IST

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రెట్రో’పై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఇక తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం మాస్ యాక్షన్‌తో కట్ చేయడంతో సూర్య ఫ్యాన్స్‌కు ఇది బాగా నచ్చుతోంది. ఇక ఈ సినిమాలో సూర్య లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రేమ, నవ్వులు, యుద్ధం అనే కాన్సెప్ట్‌తో దర్శకుడు కార్తీక్ సుబ్బారాజ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. టెంప్లేట్ పాతదే అయినా, ఈ సినిమాను సరికొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నారని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా జోజు జార్జ్, జయరాం, కరుణాకరన్, నాజర్, ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా మే 1న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు