సూర్య సినిమాకు తక్కువగానే వచ్చిన టీఆర్పీ.!

Published on Jan 21, 2021 4:00 pm IST

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అంటే మన తెలుగు ఆడియెన్స్ కు కూడా మంచి అభిమానం ఉంది. అందుకే సూర్య సినిమాలు మన దగ్గర కూడా మంచి వసూళ్లనే అందుకుంటాయి. మరి కొన్నాళ్లుగా సూర్యకు మంచి హిట్ లేదు అనుకునే సమయంలోనే సుధా కొంగర దర్శకత్వంలో చేసిన ఎమోషనల్ అండ్ ఇన్స్పైరింగ్ చిత్రం “ఆకాశం నీ హద్దురా”.

తమిళ్ మరియు తెలుగు భాషల్లో ఏకకాలంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో వరల్డ్ డిజిటిల్ ప్రీమియర్ గా విడుదల కాబడ్డ ఈ చిత్రం అద్భుతమైన టాక్ తో యూనానిమస్ హిట్ గా నిలిచింది. మరి స్ట్రీమింగ్ లో అద్భుతంగా రాణించిన ఈ చిత్రం మాత్రం టెలివిజన్ స్క్రీన్ పై ఊహించిన స్థాయి రేటింగ్ ను అందుకోకపోవడం బాధాకరం.

సంక్రాంతి కానుకగా జెమినీ టీవిలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ కాబడిన ఈ చిత్రానికి గాను కేవలం 6.83 రేటింగ్ మాత్రమే వచ్చింది. కానీ టెలివిజన్ ఇంప్రెషన్స్ లో మాత్రం ఒక కోటికి పైగానే వచ్చాయి. మరి రేటింగ్ ఇంత తక్కువ రావడం అనేది ఆశ్చర్యకరంగా మారింది. బహుశా అప్పటికే చాలా మంది ఓటిటిలో చూసెయ్యడం మూలాన ఇంత తక్కువ రేటింగ్ వచ్చి ఉండొచ్చు.

సంబంధిత సమాచారం :