సూర్య ఎమోషనల్ హిట్ మళ్ళీ రిలీజ్ కాబోతుంది.!

Published on Mar 31, 2021 12:05 pm IST

తమిళ్ మరియు తెలుగులో కూడా మంచి మోస్ట్ లవబుల్ హీరోల్లో ఒకరైన సూర్య తన లేటెస్ట్ ఫిల్మ్ “సూరారై పొట్రు” తెలుగులో “ఆకాశం నీ హద్దురా”తో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వడమే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర కూడా ఒక మంచి సినిమాను ప్రెజెంట్ చేసిన వారు అయ్యారు. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బయోపిక్ చిత్రం ఆస్కార్స్ వరకు వెళ్లి చివరి నిమిషంలో వెనక్కి వచ్చింది.

అయితే మన దక్షిణాది కీలక భాషల్లో డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటిటి రిలీజ్ కాబడిన ఈ చిత్రం మళ్ళీ అదే ప్రైమ్ వీడియోలో విడుదల కానుందట. కాకపోతే ఈసారి హిందీ వెర్షన్ లో విడుదల కానుందట. హిందీలో “ఉడాన్” అనే టైటిల్ తో వచ్చే ఏప్రిల్ 4న విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఈ చిత్రంలో సూర్య సరసన అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటించగా జీవి ప్రకాష్ సంగీతం అందించాడు. అలాగే ఈ చిత్రాన్ని సూర్య కూడా నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :