లేడీ ఫ్యాన్స్ కోసం సూర్య దగ్గర స్పెషల్ ప్లాన్

Published on Feb 26, 2020 2:28 am IST

హీరో సూర్యకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కొంచెం ఎక్కువే. ఆయన చిత్రాల విడుదల మొదటిరోజు థియేటర్లకు లేడీ ఫ్యాన్స్ తాకిడి గట్టిగా ఉంటుంది. అందుకే సూర్య తన కొత్త చిత్రం ‘సూరరై పొట్రు’ విడుదల రోజున తన మహిళా అభిమానులకు స్పెషల్ ట్రీట్ ప్లాన్ చేస్తున్నారట. తమిళనాడు తర్వాత తనకు ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉన్న కేరళలో లేడీ ఫ్యాన్స్ కోసం స్పెషల్ గర్ల్ షో ఏర్పాటు చేశారట.

ఈ ప్రత్యేకమైన షోకు కేవలం అమ్మాయిలకు మాత్రమే అనుమతి ఉంటుంది. త్వరలోనే షో వివరాలను ప్రకటించనున్నారు. ఇకపోతే సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో తెలుగు సీనియర్ నటుడు మోహన్ బాబు ఓ కీలకపాత్ర చేయడం జరిగింది. అపర్ణ బాలమురళి సూర్యకి జంటగా నటిస్తుండగా, జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More