బర్త్ డే ట్రీట్ రెడీ చేస్తున్న సూర్య.. విశ్వనాథ్ అండ్ సన్స్ నుంచి రాబోయే అప్డేట్ అదేనా..?

బర్త్ డే ట్రీట్ రెడీ చేస్తున్న సూర్య.. విశ్వనాథ్ అండ్ సన్స్ నుంచి రాబోయే అప్డేట్ అదేనా..?

Published on Jul 8, 2026 12:05 AM IST

Vishwanath

తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రేజీ ఫ్యామిలీ డ్రామా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై అంచనాలు పెంచేసింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు సంబంధించిన రెండో సింగిల్ సాంగ్‌ను సూర్య బర్త్ డే ట్రీట్‌గా జూలై 23న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ పాటలో అసలు విశేషం ఏంటంటే.. దీనిని స్వయంగా హీరో సూర్యనే పాడాడు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సాంగ్, సూర్య వాయిస్‌లో అభిమానులను ఎంతగానో అలరించనుందని టాక్.

సూర్య సరసన మలయాళ బ్యూటీ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ చిత్రాన్ని ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు