వర్మ డైరెక్టర్ ఈసారి స్టార్ హీరో తో .. ?

Published on Apr 2, 2019 10:08 pm IST

కోలీవుడ్ డైరెక్టర్ బాలా ఇటీవల ‘వర్మ’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. అర్జున్ రెడ్డి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం విడుదలకు ముందే ఆగిపోయింది. అవుట్ ఫుట్ నచ్చక పోవడంతో ఈచిత్ర నిర్మాతలకు బాలా కు మధ్య వివాదం తలెత్తింది. దాంతో ఈ చిత్రం నుండి తప్పుకుని బాలా కొత్త స్క్రిప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు.

ఇక ఈ డైరెక్టర్ ఈ సారి సూర్య తో సినిమా చేయాలనీ పట్టుదలగా వున్నాడట. సంగీత దర్శకుడిగా జీవి ప్రకాష్ కుమార్ ను సెలెక్ట్ చేశాడు. సూర్య కు స్టోరీ లైన్ ను కూడా వినిపించాడట. అయితే సూర్య ఇప్పట్లో ఫ్రీ అయ్యేలా కనిపించడం లేదు. ప్రస్తుతం ఆయన ,కాప్పాన్ లో నటిస్తున్నాడు. ఈచిత్రం తరువాత సుధా కొంగర , హరి తో సినిమాలకు కమిట్ అయ్యాడు. మరి ఈ సినిమాల తరువాత అయిన సూర్య , బాలాకు ఛాన్స్ ఇస్తాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :