సూర్య సినిమా కూడా పోస్ట్ ఫోనే !

Published on Apr 7, 2020 1:00 am IST

తమిళ్ స్టార్ హీరో సూర్య, మాస్ డైరెక్టర్ హరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా జూన్ నుండి సెట్స్ పైకి వెళ్ళాలి. కానీ కరోనా కారణంగా షూటింగ్ ను పోస్ట్ ఫోన్ చేశారు. అక్టోబర్ నుండి షూటింగ్ ప్లాన్ చేయనున్నారు. ఇక గతంలో సూర్య, హరిల కాంబినేషన్లో ‘సింగం, ఆరు, వేల్’ లాంటి సినిమాలు వచ్చి ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.

అయితే సూర్యను ఎక్కువుగా పోలీస్, మాస్ కథల్లో చూపిన హరి ఈసారి ఫ్యామిలీ స్టోరీలో చూపించబోతున్నారు. సూర్య పూర్తి స్థాయి కుంటుంబ కథా చిత్రం చేసి చాల కాలం అయింది. ఒకరకంగా వీరి గత చిత్రం ‘వేల్’ తరహాలో ఉంటుందట కొత్త చిత్రం.

ఇక ఈ సినిమాకు ‘అరువా’ అనే టైటిల్ నిర్ణయించారు. సినిమా షూటింగ్ ఎక్కువ భాగం సౌత్ తమిళనాడులోనే జరగనుందట. డి.ఇమ్మాన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

సంబంధిత సమాచారం :

X
More