సూర్య కొత్త సినిమా మొదలయ్యేది ఎప్పుడంటే

Published on Mar 13, 2021 3:00 am IST

స్టార్ హీరో సూర్య ‘సూరరై పోట్రు’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆస్కార్ బరిలో కూడ నిలిచింది. ఈ విజయంతో సూర్య మరోసారి హిట్ ట్రాక్ ఎక్కారు. ఈ విజయాన్ని లాగే నిలుపుకోవాలని ఉద్దేశ్యంతో ఆయన పలు ఆసక్తికరమైన సినిమాలకు సైన్ చేశారు. వాటిలో పాండిరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా ఉంది. ఈ సినిమా ఈ వారంలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇందులో సూర్యకు జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ కథానాయకిగా నటించనుంది. సూర్య మార్చి 15వ తేదీ నుండి షూటింగ్లో జాయిన్ కానున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు డి.ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రంలో సూర్య తమ్ముడు, హీరో కార్తీ అతిధి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ‘సూరరై పొట్రు’ తరవాత సూర్య చేస్తున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో, సినీ వర్గాల్లో మంచి అంచనాలున్నాయి. ఇది కాకుండా సూర్య వెట్రిమారన్ దర్శకత్వంలో ఒకటి, వసంతబాలన్ దర్శకత్వంలో ఇంకొకటి చేయనున్నారు.

సంబంధిత సమాచారం :