సర్ప్రైజింగ్..యూఎస్ లో మొదలైన “సలార్” విధ్వంసం!

salaar2

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో శృతి హాసన్ హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” కోసం అందరికీ తెలిసిందే. మరి వరల్డ్ వైడ్ గా కూడా సెన్సేషనల్ హైప్ తో ఉన్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమాని అయితే యూఎస్ లో ఊహించని లెవెల్లో ఇండియన్ సినిమా నుంచి నెవర్ బిఫోర్ రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

ఇక యూఎస్ లో అయితే అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రం బుకింగ్స్ ఈ ఆగస్ట్ 25 నుంచి అందుబాటులోకి తెస్తామని ముందు కన్ఫర్మ్ చేయగా కానీ సర్ప్రైజింగ్ గా ఈ చిత్రం బుకింగ్స్ ఆల్రెడీ ఓపెన్ చేసేసారు. దీనితో ఇలా కూడా మొదలైన ఈ సినిమా బుకింగ్స్ భారీ స్థాయిలో నమోదు అవుతున్నాయి అని తెలుస్తుంది. ఇలా స్టార్ట్ కావడంతోనే గంటల్లోకి లక్ష డాలర్స్ కి మేర బుకింగ్స్ దగ్గరకి వచ్చేసాయి. దీనితో సలార్ మ్యానియా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Exit mobile version