వరుస సినిమాలతో బిజీగా స్టార్ హీరో !

వరుస సినిమాలతో బిజీగా స్టార్ హీరో !

Published on Jun 4, 2018 11:11 PM IST


తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం సెల్వ రాఘవన్ తెరకెక్కిస్తున్న’ఎన్జీకె ‘ సినిమా షూటింగ్ లో పాలుగొంటుంన్నాడు . దీని తరువాత వరుస సినిమాలకి కమిట్ అయ్యాడు సూర్య. కే వి ఆనంద్ దర్శకత్వంలో సూర్య తన 37వ సినిమాలో నటించనున్నాడని తెలిసిందే ఈ నెల 23నుండి ఈ సినిమా షూటింగ్ లండన్ లో మొదలుకానుంది .

ఇక తన 38వ సినిమాని సుధా కొంగర దర్శకత్వంలో చేయనున్నాడు సూర్య. దీని తరువాత ‘సింగం’ చిత్రాల దర్శకుడు హరి తెరకెక్కిన్చనున్న సినిమాలో నటించనున్నాడు . ఈ సినిమా సింగం సిరీస్ కు కొనసాగింపుగా కాకుండా ఫ్రెష్ సబ్జెక్టుతో రానుంది.ఇది సూర్యకు 39వ సినిమా కానుంది. ఇలా వరుస సినిమాలతో మరో ఏడాది పాటు బిజీగా ఉండనున్నాడు ఈ స్టార్ హీరో .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు