సూర్యకాంతం టీజర్ టాక్ : నిహారిక 2.0 !

Published on Jan 25, 2019 5:00 pm IST

మెగా డాటర్ నిహారిక కొణిదెల , రాహల్ విజయ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సూర్యకాంతం’. ఈచిత్రం యొక్క టీజర్ ను కొద్దిసేపటి క్రితం విడుదలచేశారు. ఇక టీజర్ లో నిహారిక వన్ మ్యాన్ షో చేసింది. హీరో రాహుల్ ను ఆటపట్టించే అమ్మాయిగా కనిపించింది. ఈచిత్రంలో ఎలాగైనా తన పంతం నెగ్గించుకోవాలి అనే అమ్మాయి పాత్రలో నటిస్తుంది నిహారిక. మొత్తానికి ఈ టీజర్ సినిమా ఫై అంచనాలను పెంచేలా వుంది. ఇక తన గత చిత్రాల్లో మాదిరిగా కాకుండా ఈచిత్రంలో నిహారిక క్యారెక్టరైజేషన్ చాలా కొత్త గా ఉండనుంది.

మరి ఈ చిత్రం తో నిహారిక కెరీర్ లో మొదటి విజయాన్ని అందుకుంటుందో లేదో తెలియాలంటే మార్చి 29వరకు ఆగాల్సిందే. నూతన దర్శకుడు ప్రణీత్ బ్రహ్మాండపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నారు. నిర్వాణ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :