మరికొన్ని గంటల్లో సూర్య ‘గ్యాంగ్’ టీజర్!

సూర్య హీరోగా న‌టిస్తున్న‌ తమిళ చిత్రం ‘తన్న సెరెంద కూటం’. విఘ్నేష్‌ శివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల రిలీజైన తమిళ్ వెర్షన్ టీజర్‌కి మంచి స్పందన లభించింది. ‘గ్యాంగ్’ పేరుతో తెలుగులో జనవరి 12 న విడుదలకానున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ టీజర్ ను రేపు రిలీజ్ చెయ్యనున్నారు చిత్ర యూనిట్.

యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్2 సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ అందించిన సంగీతం ప్లస్ కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఆడియోను ఈ నెల చివరి వారంలో విడుదల చెయ్యనున్నారు. రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనున్న ఈ మూవీ పై మంచి అంచనాలు ఉన్నాయి. త్వరలో సెన్సార్ పూర్తి చేసుకోనున్న ఈ సినిమాలో సూర్య మాస్ లుక్ లో ప్రేక్షకులను అలరించబోతున్నాడు.