యూట్యూబ్‌లో అదిరిపోయే రికార్డ్ సెట్ చేసుకున్న సూర్య పాట..!

Published on Jul 31, 2021 8:00 pm IST

తమిళ స్టార్ హీరో సూర్య కథా నాయకుడిగా, సుధ కొంగర దర్శకత్వంలో ‘ఎయిర్‍ డెక్కన్‍’ గోపీనాధ్‍ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం “ఆకాశం నీ హద్దురా”. ఎమోషనల్ ఎయిర్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం గత ఏడాది నేరుగా ఓటీటీలో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున సంగతి తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే హీరో సూర్యకు తమిళ్‌లోనే కాకుండా తెలుగులో కూడా సూపర్ ఫాలోయింగ్ ఉంది.

అయితే ఆకాశమే నీ హద్దురా సినిమాలోని “కాటుక కనులే” పాట తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఈ పాట యూట్యూబ్‌లో 10 కోట్ల వ్యూస్‌ను కొల్లగొట్టి రికార్డ్‌ను క్రియేట్ చేసింది. అయితే తమిళ వెర్షన్‌లో “కట్టు పాయలే” అనే వచ్చిన ఈ పాట ఇప్పటి వరకు 6.3 కోట్ల వ్యూస్‌ను మాత్రమే సాధించింది. ఈ రికార్డ్స్‌ను చూస్తుంటే సూర్యపై ఫాలోయింగ్ తెలుగులో కూడా ఏ రేంజ్‌లో ఉందనేది ఇట్టే అర్ధమవుతుంది.

వీడియో సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :